సీనియర్లకు పనీపాటా లేదు: రాజనర్సింహ
మెదక్: నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ నెల 24వ తేదీన తెలంగాణ రణభేరిని తలపెట్టిన కాంగ్రెస్ సీనియర్ నాయకులపై పాఠశాల విద్యా మంత్రి దామోదరం రాజనర్సింహ నిప్పులు చెరిగారు. సీనియర్లకు పనీ పాటా లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పదవులు లేకపోవడంతో ఏదైనా చేస్తామంటే ప్రజలు తేలికగా నమ్మబోరని ఆయన అన్నారు. ఇష్టం ఉన్నప్పుడు తెలంగాణ, ఇష్టం లేనప్పుడు కాదు అంటున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఇష్టం ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారు, శాసనసభ్యుడు కాకున్నా అల్లుడికి మంత్రి పదవి ఇప్పించుకుంటారని ఆయన అన్నారు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి ఏం ఇస్తావు అనే ధోరణితో కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. మంత్రులను తెరాస కార్యకర్తలు ఘెరావ్ చేయాలని చూస్తూ సహించబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications