తెలంగాణపై త్వరలో నిర్ణయం: దేవేందర్
వరంగల్: తెలంగాణపై తమ పార్టీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. దేవాదులు ఎత్తిపోతల ప్రాజెక్టును ఆయన ఆదివారంనాడు ఇతర నాయకులతో కలిసి సందర్శించారు. దేవాదుల ప్రాజెక్టు పైపులైన్లు ఎక్కడ పడితే అక్కడ లీకవుతున్నాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ఆయన విమర్శించారు.
ఇదిలా ఉంటే, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారనే నమ్మకం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖా మంత్రి డి. శ్రీనివాస్ నిజామాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వడం లేదని సోనియా చెప్తే ఎవరి దారి వారు చూసుకుంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
