మావోయిస్టు మృతులు 17 మంది
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని దారెల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటరులో 14 మంది మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి కె. జానారెడ్డి ధృవీకరించారు. మరో చోట జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం అందిందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.
మొదటి ఎన్ కౌంటర్ తర్వాత కొద్ది సేపటికి రెండో ఎన్ కౌంటర్ జరిగిందని సమాచారం. మృతుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ సాయంత్రానికి ఎన్ కౌంటర్లకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని జానారెడ్డి చెప్పారు. మావోయిస్టుల కోసం గాలింపు జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్ లో జరగలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications