సోనియాతో వైయస్ భేటీ

ఇటీవలి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో జరిగిన సమావేశం వివరాలను అహ్మద్ పటేల్ రాజశేఖర రెడ్డికి వివరించినట్లు సమాచారం. సోనియాతో భేటీలో ఈ విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల ఖాళీ అయిన నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రితో సోనియా మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడి ఎన్నిక చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్ష పదవికి మల్లు రవి, వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, డి. శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
