మంత్రి పదవిపై నిర్ణయం తీసుకోలేదు: డిఎస్
హైదరాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేసే విషయమై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఉన్నత విద్యాశాఖ మంత్రి డి. శ్రీనివాస్ చెప్పారు. ఆయన బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇంటి వద్ద పలువురు మంత్రులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ అంశం జటిలమైందని, దాన్ని తాను సవాల్ గా స్వీకరిస్తానని ఆయన చెప్పారు. రేపు (గురువారం) మధ్యాహ్నం ఆయన పిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
పిసిసి పదవి కష్టతరమైన బాధ్యతేనని, అయితే దాన్ని తాను సమర్థంగా నిర్వహించగలననే నమ్మకం ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను సమన్వయంతో ముందుకు సాగుతానని, అదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. ఒంటరి పోరాటంపై తనకు నమ్మకం లేదని, పార్టీలోని సీనియర్లతో, ముఖ్యమంత్రితో సమన్వయం సాధించి పనిచేస్తానని ఆయన చెప్పారు. ఇతర పార్టీలతో కూడా సమన్వయం సాధించాలనేది తన అభిమతమని, ముందు పార్టీ బలంగా ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications