ఇంటిపేరు గాంధీ, అందుకే వీలైంది: రాహుల్
మంగళూరు: రాజకీయాల్లోకి ప్రవేశించడం ఎవరికైనా చాలా కష్టమని, తన ఇంటి పేరు "గాంధీ" కావడం వల్ల తన రాజకీయ రంగ ప్రవేశం సులభమైందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అంగీకరించారు.
రాజకీయాల్లో క్రియాశీల పాత్ర వహించే అవకాశాలు అందరికీ అందుబాటులో లేవని అయన పేర్కొన్నారు. మణీపాల్ కళాశాలలొ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ విద్యార్ధులతో ముఖా ముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విద్యార్ధి అడిగిన ప్రశ్నకు జవాబుగా రాహుల్ గాంధీ రాజకీయాల గురించి చెప్పారు.












Click it and Unblock the Notifications
