మంత్రి ఇంటి పనిమనిషి ఆత్మహత్యా యత్నం
హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి టి. జీవన్ రెడ్డి ఇంటిలోని పని మనిషి అశోక్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతను ప్రస్తుతం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు. ప్రేమ వైఫల్యమే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అశోక్ రాసి పెట్టిన సూసైడ్ నోటును, ఒక యువతి ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలానికి చెందిన అశోక్ జగిత్యాలలో తమ ఇంటి పక్కనే ఉన్న శ్వేత అనే అమ్మాయిని ప్రేమించాడు. అయితే పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. దీంతో నిరాశకు గురైన అశోక్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అశోక్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications