చిరు పార్టీ ఖాయం: మాజీ ఐఎఎస్
విశాఖపట్నం: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఖాయమని మాజీ ఐఎఎస్ అధికారి రోశయ్య అన్నారు. మెజారిటీ ప్రజలకు నాయకత్వాన్ని అందించేందుకు ఎజెండా సిద్దమైందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. చిరంజీవి తనకు బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. కార్యకర్తగా చిరంజీవి అప్పగించే ఏ బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు.
మెజారిటీ ప్రజల అభిమతానికి అనుగుణంగా చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నవారిలో తాను ఒక్కడిని అని ఆయన అన్నారు. చిరంజీవిని వెన్నంటి ఉండి నడిపించే వారిలో తాను కూడా ఉన్నానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో రాణించడానికి చదువు, అనుభవం అక్కర్లేదని, గ్రహించే శక్తి అపారంగా ఉండడం అవసరమని, అది చిరంజీవికి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications