తెరాస కోరితే ఆలోచన: దత్తాత్రేయ
హైదరాబాద్: కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల కపట నాటకంలో ముందుకు వస్తున్న ఉప ఎన్నికలను ధీటుగా ఎదుర్కుంటామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ చెప్పారు. ఖైరతాబాద్, ముషిరాబాద్ శాసనసభా నియోజకవర్గాలకు పరిశీలకులను నియమిస్తున్నట్లు ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు.
తెరాస కోరితే పోటీ నుంచి విరమించుకునే ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి జెండా పండుగ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా వారం రోజుల పాటు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు పరిశీలకులను నియమిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications