టిడిపికి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
కరీంనగర్: మాజీ శాసనసభ్యుడు కటారి దేవేందర్ రావు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉందని రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చేసిన ప్రకటనకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం వైఖరి మారకుంటే పార్టీకి పుట్టగతులుండవని ఆయన అన్నారు.
తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెబుతుండగా, తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని హరికృష్ణ ప్రకటించారని, తెలంగాణ ప్రజల్లో ఉన్న తీవ్రమైన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కరీంనగర్ నుంచి ఆయన ఒకసారి శాసనసభ్యుడిగా గెలిచారు. మూడు సార్లు మున్సిపల్ చైర్మనుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications