'జల్సా' చూసిన చిరంజీవి తల్లి
హైదరాబాద్: తన కుమారుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాను అంజలీదేవి థియేటర్లో చూశారు. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజలీదేవి బుధవారం ఉదయం హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్సులో గల సంధ్య థియేటర్లో జల్సా సినిమాను చూశారు. ఆమెతో పాటు హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ సినిమాకు వచ్చారు. జల్సా విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి చోటు చేసుకుంది.
హైదరాబాదులోని కూకట్ పల్లి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కటౌటుకు అభిమానులు క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. విజయవాడలో పవన్ అభిమానులు మోటారు సైకిల్ ర్యాలీ తీశారు. థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ కటౌట్లు పెద్ద యెత్తున ఏర్పాటు చేశారు. సినిమా ప్రివ్యూ మంగళవారం రాత్రి ప్రసాద్ ఐ మాక్స్ థియేటర్లో జరిగింది. ఈ ప్రివ్యూకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications