ఒక్కో విద్యార్థికి రు. 57 లక్షల జీతం
హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) విద్యార్థులకు లక్షల రూపాయల్లో జీతాలు ముట్టే ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఐఎస్ బిలో బుధవారంనాడు 2008 సంవత్సరానికిగాను క్యాంపస్ సెలెక్షన్స్ జరిగాయి. దేశ, విదేశీ కంపెనీలు విద్యార్థులను ఉద్యోగాల్లో పెట్టుకునేందుకు ఆసక్తి కనబరిచాయి. ఒక్కో విద్యార్థికి సగటున ఏడాదికి 57 లక్షల రూపాయల జీతం పలికింది.
మొత్తం 657 ఉద్యోగాలకుగాను 422 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు వచ్చారు. వ్యక్తిగతంగా ఎవరెవరికి ఎంత జీతం ఆఫర్ చేశారనే విషయాన్ని వెల్లడించడం లేదు. నిరుడు కూడా ఐఎస్ బి విద్యార్థులకు మంచి ఆఫర్సే వచ్చాయి. నిరుటి కన్నా ఈ ఏడాది ఎక్కువ కంపెనీలు విద్యార్థులకు జాబ్ ఆఫర్స్ ఇచ్చినట్లు సమాచారం. విద్యాసంస్థలో బిజినెస్ మేనేజ్ మెంటు కోర్సు చేసిన విద్యార్థుల్లో ఇంజినీర్లు, వైద్యులు ఉన్నారు.












Click it and Unblock the Notifications