బాబు నన్ను కించపరిచారు: కుతూహలమ్మ

హైదరాబాద్: ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనను ముమ్మాటికీ కించపరిచారని శాసనసభ డిప్యూటీ స్పీరక్ కుతూహలమ్మ అన్నారు. చంద్రబాబు అన్న మాటలు రికార్డుల్లో లేనంత మాత్రాన వాస్తవాలు కాకుండా పోతాయా అని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనను కించపరిచిన విషయాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. ఈ విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని ఆమె అన్నారు. చంద్రబాబు తీరు తనను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందని ఆమె అన్నారు. తనను అసమర్థురాలిగా చిత్రీకరించడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆమె అన్నారు.

సభకు స్పీకర్ రావాలని అనడం తాను శాసనసభ అధ్యక్ష స్థానంలో కూర్చోవడానికి అనర్హురాలినని సంకేతం ఇచ్చినట్లే కదా అని ఆమె అన్నారు. తనపై చంద్రబాబు ఏకవచన ప్రయోగంతో సంబోధించారని ఆమె అన్నారు. తనను జిల్లా పరిషత్ చైర్మన్ ను చేసింది ఎవరో గానీ తప్పించింది మాత్రం చంద్రబాబేనని ఆమె అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తానే ముఖ్యమంత్రిని అన్నట్లు చంద్రబాబు ప్రవరిస్తున్నారని, అసహనం ప్రదర్శిస్తున్నారని ఆమె విమర్శించారు. తనను అవమానించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తనకు ఎప్పుడూ ఇటువంటి స్థితి రాలేదని ఆమె అన్నారు. దళిత మహిళగా తాను సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నప్పుడు స్పీకర్ రావాలని అనడం తనను కించపరచడమేనని ఆమె అన్నారు. దళితులు రాజ్యాధికారాని పనికి రారా అని ఆమె ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+