నా తప్పేం లేదు: రజనీకాంత్

హైదరాబాద్: హొగెనకల్ వివాదంపై తానేమీ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అవసరమైతే తాను కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధమేనని ఆయన సోమవారంనాడు అన్నారు. హొగెనకల్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా కర్ణాటకలో తమిళ సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించడాన్ని ఆయన చేపక్ లో తమిళ సినీ కళాకారుల నిరాహార దీక్ష సందర్భంగా అన్నారు. కర్ణాటకలో పుట్టి పెరిగిన రజనీకాంత్ తమిళ సినీ కళాకారులు చేపట్టిన ఒక నిరాహారదీక్షలో కూడా పాల్గొన్నారు.

రజనీకాంత్ తీరుపై కన్నడ రక్షణ వేదిక మండిపడుతోంది. కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ నిరాహార దీక్షలో పాల్గొని కన్నడ ప్రజలను అవమానించారని విమర్శించింది. కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు రజనీకాంత్ ను కర్ణాటకలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించింది. రజనీకాంత్ సినిమాలను ప్రదర్శించనీయమని చెప్పింది. కన్నడ ప్రజలకు రజనీకాంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+