తిరుపతి: హీరోయిన్ శ్రియ తిరుమల కొండపై ఉగాది రోజున చేదు అనుభవం చవిచూడవలసి వచ్చింది. సోమవారం తెల్లవారు జామున రెండున్నర గంటలకు సుప్రభాత సేవకు కుటుంబ సభ్యులతో సహా హాజరైన శ్రియ నడుంపై ఒక అభిమాని చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దానితో షాక్ తిన్న ఆమె హరి అనే తన అభిమానిని చెంపదెబ్బ కొట్టారు.
శ్రియ ఆ వ్యక్తి మీద ఫిర్యాదు చేయకుండా, తాను దిగిన అతిధి గృహానికి వెళ్ళకుండా వాహనంలో వెళ్ళిపోయారు. స్ధానిక ఎమ్మెల్యే ఎం వెంకటరమణ శ్రియ కోసం కొండ మీద అన్ని ఏర్పాట్లు చేసినా ఈ అపశృతి దొర్లింది.