ఎన్నికల కోసమే రేషన్ బియ్యం: టిడిపి

Chandrababu Naidu
హైదరాబాద్/ కరీంనగర్: ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కళా వెంకట్రావు విమర్శించారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని, ఎన్నికలు సమీపించడంతో పేదలు గుర్తుకు వచ్చారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ ఫొటో పెట్టాలని, కాంగ్రెస్ కార్యకర్తలు మీసాలు మెలి వేయాలని వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి అంటున్నారని, అంటే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం కింది బియ్యాన్ని నల్లబజారుకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నట్లేనని ఆయన అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తోందని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి కరీంనగరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఈ పథకం అమలులో అవకతవకలు జరిగితే ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు అందలేదని, రేషన్ కార్డుల పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయని, అందువల్ల రేషన్ బియ్యం పేదలకు అందే అవకాశం తక్కువేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+