ఆరోగ్యశ్రీపై వెంకయ్య ప్రశంసలు

Venkaiah Naidu
విశాఖపట్నం: ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. స్వల్ప లోపాలు ఉన్నప్పటికీ ఆరోగ్య శ్రీ పథకం చాలా మంచిదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని లోపాలు లేకుండా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ పథకం పేదలకు ప్రయోజనకారి అవుతుందని ఆయన అన్నారు.

నిత్యావసర ధరల పెరుగుదలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆందోళనకార్యక్రమాలకు తమతో కలిసి రావాలని ఆయన వామపక్షాలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+