కోలుకుంటున్న మీనా: సందీప్ పై రౌడీ షీట్
విజయవాడ: ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని మీనాకుమారి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమెకు ఇక ఏ మాత్రం ప్రమాదం లేదని విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిర్ధారించారు. తనను మోసం చేసిందనే కోపంతో సందీప్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సందీప్ ఆమె గొంతు కోసిన విషయం తెలిసిందే. సందీప్ పై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. మణికట్టు కోసుకున్న సందీప్ పూర్తిగా కోలుకున్న తర్వాతనే అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు అంటున్నారు.
దాడి వల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆమెకు మూడు లీటర్ల మేర రక్తం ఎక్కించామని వెల్లడించారు. దాడికి సంబంధించి బుధవారం రాత్రి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ భరత లక్ష్మి ప్రభుత్వాసుపత్రికి వచ్చి మీనాకుమారి వద్ద స్టేట్‌మెంట్ నమోదు చేసుకు్న్నారు. మరోవైపు నిందితుడైన సందీప్ మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు చెప్పారు. మీనాకుమారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై అక్రమ చొరబాటు, వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications
