భార్య గొంతు కోసిన భర్త
విశాఖపట్నం: విశాఖపట్నంలోని బియ్యపువాని పాలెంలో ఒక భర్త తన భార్య గొంతు కోశాడు. తన కోరిక తీర్చలేదనే కోపంతో అతను బ్లేడులతో ఆమె గొంతు కోశాడు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. శ్రీకాకుళానికి చెందిన శివాజీకి బియ్యపువానిపాలెం గ్రామానికి చెందిన వరలక్ష్మితో 2004లో పెళ్లయింది. పెళ్లి అయిన తర్వాత భర్త వేధిస్తుండడంతో వరలక్ష్మి తల్లిగారింటికి వచ్చి విడాకులకు, మనోవర్తికి కేసు దాఖలు చేసింది. అయితే తనతో రావాలని శివాజీ వరలక్ష్మిని మధ్యమధ్య పట్టుబడుతూ వస్తున్నాడు.
శుక్రవారం ఇక్కడికి వచ్చిన శివాజీ భార్యతో గొడవ పడ్డాడు. తన కోర్కె తీర్చాలని పట్టపగలు పట్టుబట్టాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో తన వద్ద మూడు బ్లేడులతో భార్య గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన వరలక్ష్మిని కెజిహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
