బాలిక గొంతు కోసిన ఉన్మాది
మహబూబ్ నగర్: ఒక ఉన్మాది మహబూబ్ నగర్ లో ఒక థియేటరులో ఒక అమ్మాయి గొంతు కోశాడు. అతన్ని థియేటర్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన అమ్మాయిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ దాడిలో అమ్మాయి స్వల్పంగానే గాయపడిందని చెబుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న లలిత వెంట గద్వాలలో గాజుల వ్యాపారం చేసే శ్రీనివాస్ ఆదివారంనాడు సినిమాకు వచ్చాడు. ఇద్దరు థియేటరులో గొడవ పడి వెళ్లిపోయారు.
సోమవారం తిరిగి ఆ అమ్మాయి వెంట శ్రీనివాస్ సినిమాకు వచ్చాడు. తిరిగి ఆమెతో అతను గొడవ పడ్డాడు. దీంతో అతన్ని సిబ్బంది బయటకు పంపారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన అతను ఆమెపై దాడి చేశాడు. వెంటనే థియేటర్ సిబ్బంది పట్టుకుని అతన్ని పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications
