గుంటూరు కౌన్సిల్లో బాహాబాహీ
గుంటూరు: గుంటూరు కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ నాగరాజు రాజీనామాను ఆమోదించడానికి మంగళవారం సమావేశమైన కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్, తెలుగుదేశం సభ్యులు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని తోసుకున్నారు. మేయర్ రాజీనామాకు కారణం చెప్పాలని తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేశారు. వ్యక్తిగత విషయాలను చెప్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు.
తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగి, తోపులాటకు దారి తీసింది. ఒకానొక సందర్భంలో తాడిశెట్టి మురళీమోహన్ తెలుగుదేశం సభ్యులపైకి మైకు విసిరారు. గత సమావేశానికి అధికారాలు హాజరు కాకపోవడంపై కూడా తెలుగుదేశం సభ్యులు నిలదీశారు. ఈ స్థితిలో సమావేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో మేయర్ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. మేయర్ రాజీనామాను ఆమోదించకుండానే సమావేశం వాయిదా పడింది.












Click it and Unblock the Notifications
