అధికారులకు చిరుత తెచ్చిన తంటా
చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గ్రామంలోకి ప్రవేశించిన చిరుతను పట్టుకోకపోవడంపై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులను నిర్బంధించారు. వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. బంగారుపాళ్యం గ్రామంలోకి సమీప అడవి నుంచి ఒక చిరుత ప్రవేశించింది. ఆరు నెలలుగా అది గ్రామ పరిసరాల్లో సంచరిస్తోంది.
అనుకోకుండా అది బుధవారం నాడు వేటగాడు వేసిన ఉచ్చులో పడింది. దాన్ని బంధించి జంతు ప్రదర్శనశాలకు తరలించడంలో అటవీ శాఖాధికారులు విఫలమయ్యారు. అది అడవిలోకి పారిపోయింది. దీంతో అటవీ శాఖ అధికారులపై గ్రామస్థులు విరుచుకుపడ్డారు. ఆరు నెలలుగా అది గ్రామస్థులను భయబ్రాంతులకు గురిచేస్తూ పశువులను, మేకలను తిన్నది.












Click it and Unblock the Notifications