పొత్తుకోసం బంగారప్పతో చర్చలుః కృష్ణ
బెంగుళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పొత్తుకోసం సమాజ్‌వాది పార్టీ నేత బంగారప్పతో చర్చలు జరుపుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్‌ఎమ్ కృష్ణ తెలిపారు. ఆయన నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీతో చర్చలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అయితే తమ పార్టీలోనే ఉన్న బంగారప్ప తనయుడు కుమార బంగారప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న సోరబ్ స్థానాన్ని మాత్రం సర్దుబాటులో ఉంచబోమన్నారు. అభివృద్ధి, సుస్థిరతలే తమ ప్రధాన నినాదం కాగలదని చెప్పారు.
ధరల పెరుగుదల ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశమున్నప్పటికీ, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటం పార్టీకి మేలు చేయగలదని అభిప్రాయపడ్డారు. పార్టీ తరపున సోనియా, రాహుల్ గాంధీలు ప్రచారానికి వస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications