టిడిపితో స్నేహమా?: డిఎస్

{image-d srinivas_23042008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో చీకటి స్నేహం చేసే దిగజారుడు రాజకీయాలకు తాము దిగజారలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్ఠానవర్గం చేత ఆమోదింపజేసుకుని ఆయన బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చారు. తెర్లాం శాసనసభా నియోజకవర్గాన్ని వదిలినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ అవగాహనకు వచ్చినట్లు అనుకోవడం పొరపాటు అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము తెలుగుదేశంతో స్నేహం చేస్తే రాజకీయాలుకు అర్థం లేదని ఆయన అన్నారు.

ఉప ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం కాదని ఆయన పునరుద్ఘాటించారు. ప్రత్యేక తెలంగాణవాదం ఎవరి సొత్తు కాదని, తెలంగాణకు కాంగ్రెసుకు వ్యతిరేకం కాదని, ఉప ఎన్నికల్లో తెలంగాణవాదం ఉండదని, అభివృద్ధి నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన పనులే ప్రధానంగా తమ ప్రచారంలో ఉంటాయని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తమకే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము తెలంగాణకు వ్యతిరేకమని చెప్పడం సరి కాదని, తెలంగాణ రాష్ట్ర సమితిది సింగిల్ ఎజెండా అని, తమ ప్రణాళికలో తెలంగాణ ఒక అంశమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+