పోటీ చేయకపోతేనే నయం: పాల్వాయి
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోవడమే మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లోకసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇదివరకే ఒకసారి ఓడిపోయామని, మరోసారి ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇదే విషయాన్ని ఎన్నికల్లో చెప్తామని ఆయన అన్నారు.
తమ చేసిన అభివృద్ధిని చూపి, తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెబుతూ ఉప ఎన్నికల్లోకి దిగాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అభిప్రాయమని, తాము చేసిన అభివృద్ధి తమకు ఉప ఎన్నికల్లో సానుకూల ఫలితాలు ఇస్తాయని అనుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ రోజు ఏ పార్టీ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో లేదని ఆయన అన్నారు. తెలంగాణను తమ పార్టీ అధిష్ఠానం కాదనడం లేదని, అందువల్ల తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ప్రజలకు చెప్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications