సమైక్యాంధ్రకే నా ఓటు: కోడెల
గుంటూరు: వ్యక్తిగతంగా తాను సమైక్యాంధ్రకే ఓటు వేస్తానని, అయితే తెలంగాణ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణలోని ఉప ఎన్నికలకు కాంగ్రెస్ వారు గుంటూరు జిల్లాలో వైన్ షాపుకు ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, తద్వారా 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఇతర జిల్లాల్లో కూడా ఇదే విధంగా వసూలు చేస్తూ ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఒక రోజు అవినీతి సొమ్ముతో ఉప ఎన్నికల ఖర్చు అయిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications