బాబువన్నీ వేషాలు: వైయస్

పదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన నిర్వాకం ఏమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పదేళ్లలో చేయలేని పనులను తాము నాలుగేళ్లలో చేశామని ఆయన చెప్పారు. ఎన్నికలు వస్తున్నందున చంద్రబాబు మాటలు చెబుతున్నారని, పదేళ్లలో చేయని పనులను మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తామని చెపుతున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెలవేర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఆయన ప్రజాపథం నిర్వహించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లకు శ్రీకారం చుట్టారు. మత్స్యకారులకు బీమా పథకాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications