మావోయిస్టు నేత శ్రీనివాస్ లొంగుబాటు
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత శ్రీనివాస్ మంగళవారం మానవ హక్కుల కమీషన్ ముందు లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన శ్రీనివాస్ మెదక్ జిల్లాకు చెందినవారు. మానవహక్కుల కమిషన్ చైర్మన్ ఆయనను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)యాదవ్ కు అప్పగించారు. తనకు పోలీసుల నుంచి ముప్పు ఉందని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఉద్యమంపై వ్యతిరేకతతో లొంగిపోలేదని, తన వ్యక్తిగత కారణాల వల్ల లొంగిపోయానని ఆయన చెప్పారు.
కుటుంబానికి తన అవసరం ఉందని, తన ఆరోగ్యం కూడా బాగా లేదని, గ్రామంలో ప్రశాంతంగా జీవించే ఉద్దేశంతో లొంగిపోయానని ఆయన చెప్పారు. నాలుగేళ్లుగా 2004 నుంచి తాను రాజకీయాల్లో క్రియాశీలంగా లేనని ఆయన చెప్పారు. తన తండ్రి చనిపోయాడని, తన సోదరి ఆరోగ్యం బాగా లేదని, తల్లికి, తన సోదరికి తన అవసరం ఉందని, దాంతో తాను లొంగిపోయానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications