మరో కానిస్టేబుల్ అభ్యర్థి మృతి
ఖమ్మం: రాష్ట్రంలో జరుగుతున్న కానిస్టేబుళ్ల నియామకం పరీక్షల్లో మరో అపశృతి చోటు చేసుకుంది. గురువారంనాడు ఖమ్మంలో కానిస్టేబుల్ అభ్యర్థి కాంతారావు మరణించాడు. ఐదు కిలోమీటర్ల పరుగు పోటీల్లో పరుగు పెడుతూ కాంతారావు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతన్ని అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
కాంతారావు ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన వాడు. కానిస్టేబుళ్ల నియామకాల్లో ఇది మూడో మరణం. ఇంతకు ముందు ఇద్దరు మరణించారు. వరంగల్లులో ఒకరు, విజయవాడలో మరొక అభ్యర్థి మరణించాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. కాంతారావు మృతిపై జిల్లా ఎస్పీ ఆరా తీశారు.












Click it and Unblock the Notifications