భార్య గొంతు కోసిన భర్త
నెల్లూరు: భర్త భార్య గొంతు కోసి పరారైన సంఘటన గురువారం నెల్లూరులోని బాలాజీనగర్ లో జరిగింది. ఆటో డ్రైవరుగా పని చేస్తున్న వినయ్ కుమార్ తన భార్య త్రివేణి గొంతు కోసి పారిపోయాడు. నిందితుడ్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన త్రివేణిని ఆస్పత్రిలో చేర్చారు. త్రివేణి పరిస్థితి అపాయకరంగానే ఉంది. వినయ్ కుమార్ పనికి సరిగా వెళ్లకపోయేవాడని, ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుతుండేవని, తాజాగా అదే గొడవ జరిగిందని, దీంతో కోపంతో వినయ్ కుమార్ భార్య గొంతు కోశాడని అంటున్నారు.
ఏడేళ్ల క్రితం పెళ్లయిన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన జరిగినప్పుడు పిల్లలు ఇంట్లోనే వున్నారు. అయితే ఏం జరుగుతోందే వారికి తెలియలేదు. త్రివేణి అత్తామామలు కూడా ఇంట్లోనే ఉన్నారు. తమకు ఏమీ తెలియదని వారంటున్నారు. అయితే రక్తంతో తడిసిన దుప్పట్లను వారు నీళ్లలో నానేశారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications