రెండో పెళ్లి కోసం భార్యను చంపిన టెక్కీ?
అనంతపురం: రెండో పెళ్లి కోసం భార్యను హత్యచేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హేమలత అనే తన భార్యను చంపి నగేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. హేమలత బాత్రూంలో శవమై తేలింది. హిందూపురం సమీపంలోని ముదిరెడ్డిపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హేమలత తల్లిదండ్రుల నుంచి నగేష్ 15 లక్షల వరకట్నం, ఇతర కట్నకానుకలు తీసుకున్నాడు.
అందిన వివరాల ప్రకారం - పెళ్లి చేసుకున్న తర్వాత థాయ్ లాండ్ తీసికెళ్లాడు. తిరిగి తమ స్వగ్రామానికి వచ్చారు. నగేష్ ఎప్పుడూ తమ కూతురిని వేధించేవాడని హేమలత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నగేష్ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నాడు. హేమలతది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నగేశ్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హేమలత కుటుంబ సభ్యులు ముదిరెడ్డిపల్లికి వచ్చి నగేష్ ఇంటిలో విధ్వంసానికి దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications