దత్తాత్రేయ, కిషన్ రెడ్డిల అరెస్టు
హైదరాబాద్: అధిక ధరలకు నిరసనగా హైదరాబాదులోని సోమాజిగుడా వద్ద గల పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన బిజెపి నేతలు బండారు దత్తాత్రేయను, జి. కిషన్ రెడ్డిని పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. అధిక ధరలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు పౌరసరఫరాల కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వారు కార్యాలయంలోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసుల చర్యకు నిరసనగా దత్తాత్రేయ, కిషన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలింగింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ధరలను నియంత్రించలేకపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications
