మావోయిస్టులకు నారాయణ స్నేహహస్తం
కరీంనగర్: తెలంగాణవాదంపైనే తాము ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. తాము పోటీ చేసే రెండు శాసనసభా నియోజకవర్గాలకు ఆయన పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. హుజూరాబాద్ నుంచి మర్రి వెంకటస్వామిని, మైడారం నుంచి గట్టయ్యను పోటీకి దించుతున్నట్లు ఆయన తెలిపారు.
జనజీవన స్రవంతిలో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు. వారు ఎన్నికల్లో నిలబడితే కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. మావోయిస్టులు ఎన్నికల రాజకీయాల్లోకి దిగితే సమూల మార్పులు వస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
