42 నెలల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: ఏఫ్రిల్ 19తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 42 నెలల గరిష్ట స్థాయికి చేరి 7.57 శాతానికి చేరింది. ఏఫ్రిల్ 12తో ముగిసిన వారాంతానికి 7.33 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఈసారి వారాంతానికి మరో 0.24 శాతం మేర పెరిగింది. బియ్యం, పాలు, టీ, కూరగాయల వంటి ఆహార పదార్థాల ధరలతో పాటు కొన్ని వినిమయ వస్తువుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది.
టోకు ధరల సూచి గత ఏడాది ఇదే వారంతానికి 6.07 శాతం వద్ద ఉంది. ద్రవ్యల్బణం 2004 నవంబర్ 2తో ముగిసిన వారాంతానికి అత్యధికంగా 7.76 శాతానికి చేరింది. అనంతరం 42 నెలల తరువాత ఏఫ్రిల్ 12 వారాంతానికి అత్యధికంగా 7.57 శాతం నమోదయింది. తాజావారంలో టీ ధర 17 శాతం పెరగ్గా, పాలు, బియ్యం, కూరగాయలు, మాంసం ధరల కూడా పెరిగాయి. ఇతర సరకుల్లో లైట్ డీజిల్ ఆయిల్, ఫర్నస్ ఆయిల్ వరుసగా రెండు శాతం, ఒక శాతం పెరిగాయి. వినియమ వస్తువుల విభాగంలో ఇనుప పైపుల ధరలు 51 శాతం, ఉక్కు షీటుల ధరలు 2 శాతం పెరిగాయి.












Click it and Unblock the Notifications
