వర్గీకరణ వెంటనే అమలు కావాలి: కృష్ణ

హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఇప్పటికే మూడు విద్యాసంవత్సరాలను తాము నష్టపోయామని, ఇక ఎంత మాత్రం నష్టపోవడానికి సిద్ధంగా లేమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. శుక్రవారంనాడు కూడా ఆయన నిరాహారదీక్ష కొనసాగింది.

వర్గీకరణకు అనుకూలంగా ఉషా మెహ్రా కమిషన్ నివేదిక రావడంతో ఏం చేయాలో మాలమహానాడు నాయకుడు జూపూడి ప్రభాకరరావు పాలుపోవడం లేదని, ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. నాలుగు రోజుల నిరాహారదీక్షకే ఆస్పత్రిలో చేరిన జూపూడికి తనను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. ఉషా మెహ్రా కమీషన్ నివేదికను వెంటనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించాలని ఆయన కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాజ్యాంగనిబంధనను సవరించాలని ఉషా మెహ్రా కమీషన్ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+