ప్రకటిత కరెంట్ కోత లేదు: షబ్బీర్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రకటిత విద్యుత్ కోత లేదని రాష్ట్ర విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1563 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కొరత వల్ల విద్యుత్తు సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ సమస్యలను ఒకటి రెండు రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
సిమెంటు, స్టీలు ధరలు పెరగడం వల్ల సబ్ స్టేషన్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, ఇందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
