గూగుల్ ఇప్పుడు తెలుగులో
మనలో చాల మంది ఇంటర్నెట్ ను అనేక రకాల కార్యకలాపాల కొరకు ఉపయోగిస్తాం. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, మన అభిప్రాయాలు వ్యక్తీకరించటానికి మరియు సమాచారం శోధించటానికి. కాలేజీ లో మీ ఆప్త మిత్రుడు మీకు గుర్తున్నాడా? అతనెక్కడ ఉన్నాడో మరియు ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసుకోవడం సంతోషంగా ఉండదూ? మీకు క్షుణ్ణంగా తెలిసిన విషయం పై మీ అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మీరు అనుకుంటున్నారా? మీకు సినిమాలంటే ఇష్టం ఉండి మీరొక మంచి విమర్శకులు అయి ఉంటే, మీ చిత్ర సమీక్షను ఆన్ లైన్ పై ఎందుకు ప్రచురించుకోకూడదు? మీకు అవసరమైన సమాచారం తెలుసుకొనుటకు ఏమి చేస్తారు? బహుశా అది ఒక వంటకం గురించి కావచ్చు, లేదా రాబోయే ఎన్నికల గురించిన వివరాలు కావచ్చు? ఒక బటన్ క్లిక్ లో ఈ సమాచారాన్నంతటినీ పొందటం ఎంత ఆనందంగా అనిపిస్తుంది? మీరు ఇంగ్లీష్ మాట్లాడేటట్లయితే ఇంటర్నెట్ పై ఈ అంశాలన్నిటినీ మరియు ఇంకా ఎన్నిటినో చేయవచ్చు. కానీ ఒక్కోసారి మీరు కేవలం మీ మాతృభాషలో మాట్లాడాలని కోరుకుంటారు. చివరికి, మనము మన దైనందిన జీవనంలో ఉపయోగించే భాషల మధ్య మారుతుండటం జరుగుతుంది. ఇదే ఆన్ లైన్ లో చేయడం కూడా సాధ్యం అవుతుంది. దీన్ని సాధించడానికి గూగుల్ లోని మేము ఎంతొ కృషి చేస్తున్నాం. మరియు మేము ప్రారంభించిన ఉత్పత్తులలో కొన్నిటిని వర్ణించటానికి దీన్నొక అవకాశంగా తీసుకోదలచాం,డేటా ఎంట్రీ సులభం .
ముందుగా, మీ రెగ్యులర్ కీ బోర్డు ను ఉపయోగించి మీరు తెలుగులో సులభంగా టైపు చేసేందుకు గూగుల్ లిప్యంతరిని (Transliteration) విడుదల చేశాము. మీరు కేవలం ఆ పదం యొక్క ధ్వనిననుసరించి టైపు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఇంగ్లిష్ అక్షరాలను ఉపయోగించి "nenu" అని టైపు చేసి స్పేస్ (space) ఇచ్చిన మేము దానిని తెలుగు పదం "నేను" కు తర్జుమా చేస్తాము. గూగుల్ లాబ్స్ ఇండియా పై మేము ఈ టెక్నాలజీని ప్రారంభించాం (http://google.com/transliterate/indic/telugu). (ఇదే విధంగా చేయటానికి మీ హోమ్ పేజీకి ఒక iGoogle gadget ను కూడా మీరు చేర్చుకోవచ్చు). ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో లభిస్తుంది.స్క్రాప్ యువర్ ఫ్రెండ్స్ .
భారత దేశంలో మన వినియోగదారుల నుండి ఇలాంటి ఒక ఆశావాహ స్పందనను మేము పొందాం http://narada.oneindia.in/cms/tinymce/jscripts/tiny_mce/themes/advanced/source_editor.htm. అదేమిటంటే ఈ టెక్నాలజీని ఇతర అన్ని గూగుల్ ఉత్పత్తుల వ్యాప్తంగా అందుబాటు చేయాలని నిర్ణయించుకున్నాం . పాత పాఠశాల మిత్రుని వెదికి మరియు అతనితో చాటింగ్ ప్రారంభించాలని మీరు కోరుకున్న యెడల, ఇప్పుడు మీరు తెలుగులో ఆర్కుట్ స్క్రాప్స్ ని (http://www.orkut.com/scrapbook.aspx) పంపించవచ్చు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి . మీకు మంచి అవగాహన గల ఒక విషయం పై మీ అభిప్రాయాలను వ్యక్తం చేయదలచిన యెడల, మీ స్వంత బ్లాగును మీరు సృష్టించుకోవచ్చు మరియు తెలుగులో బ్లాగ్ పోస్ట్ ను (http://blogger.com/indic/te) వ్రాయవచ్చు. సమాచారాన్ని శోధించుట . గూగుల్ ఇప్పుడు తెలుగులో తాజా ఎన్నికల వార్తలను లేదా చలన చిత్ర విశేషాలను శోధించటాన్ని సులభం చేస్తుంది. గూగుల్ తెలుగు సెర్చ్ పేజికి (http://www.google.co.in/te) వెళ్లండి మరియు ఇంగ్లీష్ అక్షరాలను ఉపయోగించి మీ ప్రశ్నలను టైపు చేయడం ప్రారంభించండి చాలు. దానిని మేము తెలుగు లోకి మార్చి, మీరు టైపు చేసిన వాటి పై ఆధారపడి ప్రశ్నలను సూచిస్తాం. ఉదాహరణకు మీరు చిరంజీవి పై సమాచారాన్ని శోధించాలని మీరు కోరుకున్న యెడల , మీరు "chiranjeevi" అని టైపు చేయడం ప్రారంభించండి చాలు, మేము మీ కొరకు "చిరంజీవి" అని సూచిస్తాం .
హిందీ కొరకు అనువాద సేవ అయిన గూగుల్ ట్రాన్స్ లేట్™ ను ప్రారంభిస్తున్నట్లు గూగుల్ నేడు ప్రకటించింది. ఈ సరికొత్త ఉత్పత్తి హిందీ మరియు ఇంగ్లీష్ ల మధ్య దానంతటదే అనువదించేలా చేస్తుంది. కొంత పాఠాన్ని, ఒక వెబ్ పేజీని అనువదించాలని ,లేదా హిందీ లో ఒక ప్రశ్నను ఇవ్వాలని మరియు దాని ఫలితాలు ఇంగ్లీష్ నుండి అనువాదమై రావాలని కోరుకున్న యెడల, దానిని మీరు http://www.google.com/translate_t ను ఉపయోగించి చేయవచ్చు. అక్షరాస్యత గల మొత్తం భారతీయ జనాభాలో, కేవలం 13% మంది మాత్రమే ఆంగ్ల భాషలో అక్షరాస్యతను కలిగి ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ ప్రారంభం, ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానంతో సంబంధం లేకుండా, ఇంటర్నెట్ యొక్క ఘనత కారణంగా భారత దేశంలోని హిందీ మాట్లాడే వినియోగదారులు లబ్ది పొందవచ్చు.
ఈ ప్రారంభం, భారతదేశంలోని బహు-భాష వినియోగదారులకు సులభతరం చేయటం పై దృష్టి పెట్టిన వాటన్నిటి అప్ డేట్స్ పరంపరలో అత్యంత సరికొత్త సౌకర్యం. ప్రస్తుతం, హిందీ భాష మాట్లాడే వారి కొరకు ఆన్ లైన్ పై సౌలభ్యమయ్యే సమాచారంలో కొరత ఉంది. ఆ పరిస్థితి తప్పకుండా మారుతుంది. కానీ ఈ మధ్య సమయంలో ఇంగ్లీష్ ను ఆటోమాటిక్ గా అనువదించడం ద్వారా శోధన ఫలితాలను గూగుల్ ట్రాన్స్ లేట్ హిందీలో ఇవ్వటానికి http://www.google.com/translate_s ఉపకరిస్తుంది. http://www.google.co.in/ కు వెళ్ళటం ద్వారా మరియు సెర్చ్ బాక్స్ కు కుడి వైపున ఉన్న "లాంగ్వేజ్ టూల్స్" మెనూ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ పేజీని మీరు పొందవచ్చు. ఈ వెబ్ ను మనకి లాగానే బహుళ - భాషలతో కూడినది గా చేద్దాం. తెలుగులో ఆన్ లైన్ లో మీ స్నేహితులతో ముచ్చటించటం, మీ అభిప్రాయాలను వ్యక్తీకరించటం, కొత్త విషయాలను సృష్టించటం మరియు సమాచారాన్ని శోధించటం చేయవచ్చు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications