శ్రీకాళహస్తిలో రౌడీ షీటర్ హత్య
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. రౌడీ షీటర్ హరి శవం అమ్మపాలెం చెరువు వద్ద గోనెసంచిలో కట్టేసి పడి ఉంది. గోనె సంచి నుంచి దుర్వాస వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఒక కేసులో అరెస్టయిన హరి నాలుగు రోజుల క్రితం బెయిలుపై విడుదలై వచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడుతూ వచ్చాడు. ఆమె మరో వ్యక్తితో వైవాహికేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అతను ఆమెపై గొడవ పడుతూ వచ్చాడు. హరి భార్యతో వైవాహికేతర సంబంధం నెరుపుతున్న వ్యక్తి కూడా రౌడీ షీటరేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
