చంద్రమోహన్ పై 'మా' సీరియస్
{image-chandra mohan_07052008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: సినీ నటుడు చంద్రమోహన్ వ్యాఖ్యపై మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) సీరియస్ గా ప్రతిస్పందిస్తోంది. ఈ వ్యవహారంపై తమ సంఘం సమావేశమై చర్చిస్తుందని 'మా' నాయకుడు మల్లికార్జున రావు బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. చంద్రమోహన్ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో క్లిప్పింగులు, పత్రికా వార్తలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యపై వివరణ ఇస్తూ చంద్రమోహన్ 'మా'కు లేఖ రాశారు.
తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చంద్రమోహన్ ఆ లేఖలో రాశారు. తాను ఎవరినీ కించపర్చలేదని ఆయన స్పష్టం చేశారు. తాను 42 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నానని, ఇంతవరకు తాను ఏ విధమైన వివాదానికీ కారణం కాలేదని, ప్రేమాదస్పదుడిగానే ఉన్నానని ఆయన చెప్పారు. తనకు జన్మనిచ్చిన సినీ పరిశ్రమపై తాను చెడుగా ఎందుకు వ్యాఖ్యానిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications