ఐఎఎస్ లపై మంత్రి మారెప్ప విసుర్లు
హైదరాబాద్: ఐఎఎస్ అధికారులపై మంత్రి మారెప్ప బుధవారంనాడు తీవ్రంగా మండిపడ్డారు. సగం మంది ఐఎఎస్ అధికారులు పని చేయడంలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా వారు ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు. ఎస్సీల పదోన్నతులను వారు అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఐఎఎస్ అంటే ఐ యామ్ ఆల్వేస్ సేఫ్ అన్నట్లు తయారైందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరు నాయకులకు ఉపాధిగా మారిందని ఆయన అన్నారు. ఎస్సీల అధికారులపై కేసులు పెట్టిస్తున్నారని, ఎసిబి దాడులు చేయిస్తున్నారని ఆయన అన్నారు. వర్గీకరణ కోరడం కంటే అంబేద్కర్ ప్రత్యేక రాష్ట్రం కోరడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications