సాయిబాబా భక్తులకు మంత్రి ఆనం క్షమాపణలు - వివాదం పై వివరణ..!!

షిర్డీ సాయిబాబా భక్తులకు మంత్రి ఆనం క్షమాపణలు చెప్పారు. సాయిబాబా ఆలయాల విషయం లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేయడం తగదన్నారు. సాయిబాబా భక్తుల మనోభావాలను గౌరవిస్తామని.. దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. సాయిబాబా ఆలయాల విషయంలో మంత్రి ఆనం వ్యాఖ్యలపై భక్తుల అభ్యంతరం వ్యక్తం చేయటంతో వివరణతో పాటుగా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు.

షిర్డీ సాయిబాబా ఆలయాల నిర్మాణం పై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యల పైన భక్తులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. దీంతో, ఈ వివాదం పైన ఆనం స్పందించారు. సాయిబాబా ఆలయాల విషయంలో నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించి, సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని పూర్తిగా పక్కనబెట్టి కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడిని.. ప్రతిరోజూ ఉదయం తన పూజా మందిరంలో వివిధ దేవతామూర్తులతో పాటు గురుపీఠంపై కొలువై ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించిన తర్వాతే తన దినచర్యను ప్రారంభిస్తానని చెప్పారు. సాయి బాబా పట్ల తనకు అత్యంత గౌరవం, భక్తి ఉన్నాయని మంత్రి వెల్లడించారు. తన వ్యాఖ్యల వల్ల ఏ ఒక్క భక్తుని మనోభావాలు దెబ్బతిని ఉంటే, వారిని హృదయపూర్వకంగా మన్నించమని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్..!!
ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్..!!
minister-anam-ramnarayana-reddy-clarifies-his-comments-over-shirdi-sai-temples-construction-with-sri

మంత్రి ఆనం వివరణతో

రాష్ట్ర ప్రభుత్వం గానీ, దేవాదాయ శాఖ గానీ, తిరుమల తిరుపతి దేవస్థానాలు గానీ ఎవరిపైనా వివక్ష చూపడం లేదని ఆనం స్పష్టం చేసారు. అలాగే ఎవరైనా ఆరాధించే మహనీయులను కించపరచే ఉద్దేశం కూడా తమకు లేదననారు. సాయిబాబా పట్ల కోట్లాది మంది భక్తులకు అపారమైన విశ్వాసం ఉందని.. ఆ విశ్వాసాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని చెప్పారు. సాయిబాబా ఆలయాల్లో పూజలు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతున్నాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. అయితే టీటీడీ ఆధ్వర్యంలో చేపడుతున్న 5,000 భజన మందిరాలు నిర్మాణ కార్యక్రమానికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉందని చెప్పారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం మరియు గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ హిందూ దేవాలయా ల నిర్మాణమే ఆ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని స్వష్టం చేసారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నిధుల విడుదల టీటీడీ రూపొందించిన మార్గదర్శకాలు, శ్రీవాణి ట్రస్టు నిబంధనలు .. పరిపాలనా విధానాల ప్రకారమే జరుగుతోందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+