బ్రిటన్ లో ఆంధ్ర అమ్మాయి హత్య
విజయవాడ: బ్రిటన్ లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విజయవాడకు చెందిన 23 ఏళ్ల జోతిర్మయి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమె తలపై మోది హత్య చేసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. విజయవాడలోని పాతబస్తీకి చెందిన సాయిబాబ, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఒక కూతురు ఇంజినీరింగ్ చదువుతోంది. మరో కూతురు జోతిర్మయి బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ వోల్వర్ హోంమ్డన్ లో ఎంఎస్ చదువుతోంది. ఈ అమ్మాయే హత్యకు గురైంది.
వసతిగృహంలోని గదిలో జ్యోతిర్మయితో పాటు మరో ముగ్గురు మిత్రులు ఉంటున్నారు. తలుపు తీసి తీయగానే ఆగంతకులు మంగళవారం సాయంత్రం జ్యోతిర్మయి తలపై మోది హత్య చేశారు. దీంతో విజయవాడలోని జ్యోతిర్మయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జ్యోతిర్మయి మిత్రుల ఫోన్ నెంబర్లు ఇక్కడి నుంచి కలవడం లేదు. దీంతో జ్యోతిర్మయి బంధువులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. మరో అమ్మాయిపై కూడా దాడి జరిగింది.












Click it and Unblock the Notifications