గండం గట్టెడానికే వారి మాటలు: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలంగాణపై రెండు నాల్కల ధోరణితో ఉప ఎన్నికల గండాన్ని గట్టెక్కడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విమర్శించారు. వారి మాటలకు మోసపోవద్దని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. ఉద్యమ కార్యకర్తల ప్రాణాలను తీయడానికి కాంగ్రెసు ప్రయత్నిస్తోందని, ఇది వారి మదాంధతకు పరాకాష్ట అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఖతం చేస్తేనే తెలంగాణకు ఊపిరి వస్తుందని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో మల్లయ్య అనే రైతు తమకు తెలంగాణ కావాలని చంద్రబాబుతో చెప్పాడని, ఆదిలాబాదు జిల్లాలో చంద్రబాబు ప్రశ్నకు జై తెలంగాణ అని ఒక వ్యక్తి నినాదం చేశాడని, తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఇంతకన్నా ఏం కావాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం కాదని ముఖ్యమంత్రి అంటున్నారని, ఆ రకంగా ముఖ్యమంత్రి ఓటమిని ముందే అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు. కరీంనగర్ ఉప ఎన్నిక ఒక్కదాన్నే రెఫరెండం అన్న ముఖ్యమంత్రి ఈ ఉప ఎన్నికలు రెఫరెండం కాదని అనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. జలయజ్ఞం ద్వారా కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+