ముస్లిం కోటాపై స్టే కొనసాగింపు
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో ముస్లిం కోటాపై విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కౌన్సెలింగుకు మాత్రం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అడ్మిషన్లు మాత్రం జరపకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను జులై నెలకు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు నిరాకరించడంతో విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రీకౌన్సెలింగును వాయిదా వేసింది. కౌన్సెలింగు తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలియజేసింది.












Click it and Unblock the Notifications