ట్రంప్ పవర్స్ కట్, యుద్ధం చేసే అధికారం ఇక లేదా?

ఇరాన్‌తో ఎదురవుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా సైనిక చొరవలు తీసుకోకుండా ఉండేందుకు యూఎస్ సెనేట్ చారిత్రక తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో అమెరికా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. చర్చ పూర్తన వెంటే ఇరాన్‌తో సైనిక ఘర్షణ విషయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు బ్రేకులు వేస్తూ యూఎస్ సెనేట్ చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెనేటర్లు తన పనిని మరింత కష్టం చేశారని, శత్రుదేశానికి లాభం చేకూర్చారంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

ఇరాన్ వివాదంలో అమెరికా అధ్యక్షుడి యుద్ధ అధికారాలను (War Powers) పరిమితం చేస్తూ యూఎస్ సెనేట్ మంగళవారం ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ (పార్లమెంట్) అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యలు తీసుకోకుండా అధ్యక్షుడిని కట్టడి చేయడం ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం. మొత్తం 50-48 ఓట్ల తేడాతో ఈ తీర్మానం నెగ్గింది. డెమొక్రాట్లతో పాటు ట్రంప్ సొంత పార్టీ (రిపబ్లికన్) కి చెందిన నలుగురు సెనేటర్లు, రాండ్ పాల్, సుసాన్ కాలిన్స్, లిసా ముర్కోవ్స్కీ, బిల్ కాసిడీ కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.

Trump Blasts US Senate Over War Powers Vote Claims Republican Losers Provided Aid And Comfort To Iran

"వాళ్లు రిపబ్లికన్ లూజర్స్".. ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

సెనేట్ ఓటింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌తో విరుచుకుపడ్డారు. డెమొక్రాట్లతో చేతులు కలిపిన నలుగురు సొంత పార్టీ సెనేటర్లను "రిపబ్లికన్ లూజర్స్" (ఓడిపోయినవాళ్లు) అని అభివర్ణించారు.

ట్రంప్ కొత్త విమానం ఇదే.. ఆకాశంలో కదిలే శ్వేత సౌధం!
ట్రంప్ కొత్త విమానం ఇదే.. ఆకాశంలో కదిలే శ్వేత సౌధం!

"ఇరాన్ పూర్తిగా మా అదుపులోకి వచ్చే సమయానికి, నేను అడిగినవన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డ తరుణంలో... సెనేట్ ఇలాంటి పనికిమాలిన, తప్పుడు సమయపు 'వార్ పవర్స్ యాక్ట్' ఓటింగ్‌ను తెరపైకి తెచ్చింది. ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద దేశమైన ఇరాన్‌కు... 'ప్రెసిడెంట్ చేసే పనులు మాకు ఇష్టం లేదు' అని చెప్పడం ద్వారా ఈ సెనేటర్లు శత్రువుకు సహాయం, ఓదార్పు (Aid and Comfort) అందించారు. వీరు నా పనిని మరింత కష్టతరం చేశారు. అయినా సరే, ఎలాగోలా నేను అనుకున్నది సాధిస్తాను" అని ట్రంప్ రాసుకొచ్చారు.

వైట్ హౌస్ వాదన ఏంటి?

ఈ తీర్మానం ఇప్పటికే ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) లో కూడా 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. అయితే, వైట్ హౌస్ అధికారులు మాత్రం ఈ తీర్మానానికి పెద్దగా ప్రాధాన్యత లేదని కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ఒక ఉమ్మడి తీర్మానం (Concurrent Resolution) మాత్రమేనని, దీనికి అధ్యక్షుడి సంతకం అవసరం లేదని, అలాగే దీనికి చట్టపరమైన శాసనబద్ధత కూడా ఉండదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఏప్రిల్ 7వ తేదీన జరిగిన కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందంతోనే ఇరాన్‌తో ఘర్షణలు ముగిసిపోయాయని, అందువల్ల సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదనకు ఇప్పుడు అర్థం లేదని వైట్ హౌస్ వర్గాలు వాదిస్తున్నాయి.

US Visa రూల్స్ మార్చేసిన వైట్‌హౌస్! ఇక 4 ఏళ్లే ఛాన్స్..
US Visa రూల్స్ మార్చేసిన వైట్‌హౌస్! ఇక 4 ఏళ్లే ఛాన్స్..

ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి చర్చలు సాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో అధ్యక్షుడి సైనిక నిర్ణయాలపై కాంగ్రెస్ నిఘా ఉండాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. ఈ పరిణామం అమెరికాలో ప్రెసిడెంట్, కాంగ్రెస్ మధ్య అధికారాల పోరాటాన్ని మరోసారి తీవ్రం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+