IND vs WI: గౌహతిలో రికార్డుల సునామీ.. వన్డేల్లో భారత్ సరికొత్త చరిత్ర!
IND vs WI: గౌహతి వన్డే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల బ్రహ్మాండమైన స్కోరును నమోదు చేసింది. అనంతరం 406 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కేవలం 43.3 ఓవర్లలో 8 వికెట్లు మిగిలి ఉండగానే 406 పరుగులు చేసి విజయాన్ని అందుకుందియ వన్డే క్రికెట్ చరిత్రలో 400+ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. 2006లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 438 పరుగుల ఛేజింగ్ తర్వాత ఇదే అత్యధికం. ఈ విజయంతో భారత్, వెస్టిండీస్‌పై 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించి వరుసగా 14వ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
గిల్ డబుల్ సెంచరీ ప్రభంజనం.. ఆల్ టైమ్ రికార్డులు
*టీమిండియా యువ ఓపెనర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 223 పరుగులు చేసి మ్యాచ్‌ను ముందుండి గెలిపించాడు.
*వేగవంతమైన డబుల్ సెంచరీ: శుభ్‌మన్ గిల్ కేవలం 117 బంతుల్లోనే తన డబుల్ సెంచరీని పూర్తి చేసి గతంలో ఇషాన్ కిషన్(126 బంతులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
*లిస్ట్-ఏ రన్ ఛేజ్ రికార్డు: లిస్ట్-ఏ, వన్డే క్రికెట్లో పరుగుల ఛేదనలో ఓ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఇది చరిత్రకెక్కింది. గతంలో బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ 208* రికార్డును బద్ధలు కొట్టాడు.
*వేగవంతమైన 11వ సెంచరీ: శుభ్‌మన్ గిల్ తన 68వ ఇన్నింగ్స్‌లోనే 11 వన్డే సెంచరీలు పూర్తి చేసుకుని విరాట్ కోహ్లీ(82 ఇన్నింగ్స్‌లు) రికార్డును అధిగమించాడు.

రోహిత్ శర్మ 35వ సెంచరీ.. 12 వేల పరుగుల మైలురాయి
*హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 75 బంతుల్లో 101 పరుగులు పూర్తి చేసి శుభ్‌మన్ గిల్‌తో తొలి వికెట్ కు 255 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
*వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 35వ సెంచరీ. అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
*ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ వన్డేల్లో 12,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలో 7వ బ్యాటర్‌గా, భారత్ నుంచి 3వ ఆటగాడిగా(సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత) రికార్డు సృష్టించాడు.
ఒకే వన్డేలో 5 సెంచరీలు.. 811 పరుగుల వరద
ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారడంతో అనేక రికార్డులు బద్ధలయ్యాయి.
*5 సెంచరీలు: పురుషుల వన్డే చరిత్రలో ఒకే మ్యాచ్ లో 5 సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. వెస్టిండీస్ తరఫున జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్, అమీర్ జంగూ సెంచరీలు చేయగా.. భారత్ తరఫున రోహిత్, గిల్ శతకాలు సాధించారు.
బాధాకరమైన విండీస్ రికార్డు: ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాటర్లు శతకాలు చేసినప్పటికీ ఓటమి పాలైన మొదటి జట్టుగా వెస్టిండీస్ నిలిచింది.
మొత్తం మ్యాచ్ స్కోరు: ఇరు జట్ల స్కోర్లు కలిపి మొత్తం 811 పరుగులు నమోదయ్యాయి. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులలో ఇది మూడో స్థానంలో నిలిచింది.
వన్డేలలో 400+ పరుగులు సాధించిన జట్లు
భారతదేశం- 9
దక్షిణాఫ్రికా- 8
ఇంగ్లాండ్- 7
ఆస్ట్రేలియా-3
న్యూజిలాండ్-2
శ్రీలంక-2
వెస్టిండీస్-1
జింబాబ్వే-1
2022 తర్వాత వన్డేలలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
శుభ్‌మన్ గిల్ 10
విరాట్ కోహ్లీ 9
ట్రావిస్ హెడ్ 9
షాయ్ హోప్ 8
కె.మెండిస్ 8














Click it and Unblock the Notifications
