ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఈ కేంద్ర పథకంతో ప్రయాణాలు ఈజీగా, సుఖంగా!

హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. కేంద్రప్రభుత్వం తెలంగాణాకు ఎలక్ట్రిక్ బస్సుల వరం ఇచ్చిన విషయం తెలిసిందే. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద కేంద్రం కేటాయించిన 2,200 ఎలక్ట్రిక్ బస్సులు దశలవారీగా నగరానికి చేరనున్నాయి. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిపోయింది. గతంలో రోజుకు 12 లక్షల మంది ప్రయాణిస్తుంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 25 లక్షలకు చేరుకుంది.

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. రద్దీ వేళల్లో సీటు దొరకడం కష్టమై, నిలబడే స్థలం కూడా లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఈ నేపథ్యంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఎంతో ఉపయోగపడనున్నాయి. నవంబర్‌లో తొలి విడతగా 137 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 2028 జనవరి నాటికి మొత్తం 2,200 బస్సుల పంపిణీ పూర్తికావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

TGSRTC Hyderabad to Get 2 200 Electric TGSRTC Buses Under PM e-Drive Scheme to Ease Passenger Rush

హైదరాబాద్ నగరానికి మొదటి టెండర్‌లో 2,000 బస్సులు, రెండో టెండర్‌లో 200 బస్సులు మంజూరయ్యాయి. ఈవీఈవై ట్రాన్స్‌కు 60 ఏసీ, 1,025 నాన్‌ఏసీ లోఫ్లోర్ బస్సులు; గ్రీన్‌సెల్ మొబిలిటీ, పిన్నాకిల్ మొబిలిటీకి 100 మినీ బస్సులు, 815 స్టాండర్డ్ ఫ్లోర్ నాన్‌ఏసీ బస్సులు; మాతేశ్వరి అర్బన్ మొబిలిటీకి 200 లోఫ్లోర్ బస్సులు కేటాయించారు.

కొత్త బస్సులు వస్తే రద్దీ మార్గాల్లో సర్వీసుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఏసీ, నాన్‌ఏసీ, మినీ, లోఫ్లోర్ బస్సులు రావడంతో వివిధ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించవచ్చు. కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే వారికి, మహిళా ప్రయాణికులకు ఈ బస్సులు ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఇప్పటికే కొన్ని డిపోల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా కొన్ని బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం!
రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం!

అయితే రద్దీ పూర్తిగా తగ్గాలంటే బస్సుల కేటాయింపు, రూట్ల నిర్వహణ, సర్వీసుల ఫ్రీక్వెన్సీ సరిగా ఉండాలి. మొత్తంగా ఈ 2,200 ఎలక్ట్రిక్ బస్సుల రాకతో హైదరాబాద్ ప్రజా రవాణాలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. కాలుష్యం తగ్గడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం కూడా సాధ్యమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+