ఒబిసి రిజర్వేషన్లపై సుప్రీం ఊరట
న్యూఢిల్లీ: ఐఐఎం, విశ్వవిధ్యాలయాల్లో 27శాతం ఇతర వెనకబడిన కులాల (ఒబిసి) కోటా మీద కోల్ కత్తా హైకోర్టు విధించిన 'స్టే' ను సుప్రీంకోర్టు మద్యంతర ఉత్తర్వుల ద్వారా నిలిపివేసింది. డిల్లీ, ముంబై, కోల్ కత్తా కోర్టుల్లో ఉన్న ఒబిసి కోటాకు సంబంధించి కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం పెట్టిన పిటిషన్ ప్రకారం డిల్లీ, ముంబై, కోల్ కత్తా కోర్టుల్లోని ఒబిసి కోటాకు సంబంధించి కేసుల పై కూడా అత్యున్నత న్యాయస్ధానం 'స్టే' విధించింది. కేంద్రీయ విద్యాలయాల్లో జరిగే అడ్మిషన్లు తాత్కాలికమే, సుప్రీంకోర్టు తుదితీర్పు అనంతరం అంతిమ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అదేశించింది.ఒబిసి కోటా కు సంబంధించిన కేసు ఇదివరకే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా ఆవిషయం పై తీర్పు వచ్చే వరకు ఇతరులు దాని పై జోక్యం చేసుకోరాదని అత్యున్నత న్యాయస్దానం తీర్పునిచ్చింది.












Click it and Unblock the Notifications