తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకం టికెట్లను బ్లాక్ లో అమ్ముతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఉద్యోగులు ఇద్దరు విజిలెన్స్ శాఖకు పట్టుబడ్డారు. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిసి దాము, అటెండర్ నాగోజీ పది వేల రూపాయల విలువ చేసే రెండు అభిషేకం టికెట్లను రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి విక్రయించారు. ఇందులో రామానాయుడు అనే వ్యక్తి దళారీగా పనిచేశాడు.
ఆ ఇద్దరు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు రాజేంద్ర ప్రసాద్ బ్లాకులో 18 వేల రూపాయలకు రెండు అభిషేకం టికెట్లు తీసుకున్నాడు. వారు మరీ ఇబ్బంది పెట్టడంతో విజిలెన్స్ శాఖకు సమాచారం అందించారు.