ఎర్రబెల్లిపై ఎన్నారైల గరం
హైదరాబాద్: తెలుగుదేశం వరంగల్ లోకసభ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర రావు తమ సంఘం పేరు వాడుకోవడాన్ని తెలంగాణ ఎన్నారైల సంఘం ఖండించింది. తమ సంఘం మద్దతు ఇస్తున్నట్లు దయాకరరావు వాణిజ్య ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని, తాము నేరుగా నిరసన తెలియజేసినా మానుకోవడం లేదని తెలంగాణ ఎన్నారై సంఘం చైర్మన్ రవి మేరెడ్డి, కన్వీనర్ హరి మారోజు ఒక ప్రకటనలో అన్నారు. దయాకర రావు తమ సంస్థ పేరును వాడుకోవడాన్ని మానుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. ఎన్నికల కమీషనుకు, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తామని వారన్నారు.
తాము దయాకర రావును బలపరచడం లేదని, ఎన్నికల ఒక పార్టీని గానీ అభ్యర్థిని గానీ తాము బలపరచబోమని, ఇది తమ విధానమని వారన్నారు. తెలంగాణపై ఓటర్లను చైతన్యపరచమే తమ లక్ష్యమని, ఓటర్లు తెలంగాణకు అనుకూలంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని వారన్నారు. దయాకర రావు తమ సంఘం పేరును వాడుకుంటున్నట్లు వారం రోజుల క్రితం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే తాము దయాకరరావుతో మాట్లాడానని, అయితే ఆ యాడ్ ఎవరిస్తున్నారో తనకు తెలియదని చెప్పారని వారన్నారు. తాము సంబంధిత టీవీ చానెలుతో కూడా మాట్లాడామని, తీసేస్తామని చానెలు ప్రతినిధులు చెప్పారని వారు వివరించారు. అయితే ఆ స్క్రోలింగ్ ఇప్పటికీ అలాగే ప్రసారమవుతోంది.












Click it and Unblock the Notifications